తెలంగాణ

నేడు, రేపు నియోజకవర్గాల సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: వచ్చే నెల 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించుకుని ఏర్పాట్లపై చర్చించుకోవాలని, ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. శనివారం మంత్రి తలసాని జంట నగరాల్లోని ముఖ్య నాయకులతో ఈ విషయంపై చర్చించారు. ప్రగతి నివేదన సభకు ప్రజలను తరలించేందుకు కార్యకర్తలు అంకితమైన భావంతో పని చేయాలని ఆయన కోరారు. సభకు బయలుదేరే ప్రతి వాహనానికి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతో బ్యానర్ విధిగా పెట్టాలని ఆయన తెలిపారు.
8 కమిటీల ఏర్పాటు..
ఇలాఉండగా ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం వివిధ కమిటీలను నియమించింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కే. తారక రామారావు, పి. మహేందర్‌రెడ్డి సమన్వయకర్తలుగా ఉంటారు.
సభా ప్రాంగణ, పార్కింగ్ కమిటీలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, వాలంటీర్స్ కమిటీ సభ్యులుగా శంభీపూర్ రాజు, రాంబాబు, శ్రీనివాస్ యాదవ్, మంచినీరు, ఇతర సౌకర్యాల కమిటీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, నగర అలంకార కమిటీలో దానం, మైనంపల్లి, ఎంఎస్ ప్రభాకర్, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీలో బాలకిషన్, శివకుమార్, సాయిచంద్, మీడియా కమిటీలో బాల్క సుమమన్, కర్నె ప్రభాకర్, భానుప్రసాద్, బూర నర్సయ్య గౌడ్, ఫొటో ఎగ్జిబిషన్ కమిటీ సభ్యులుగా ధర్మేందర్, కర్నాటి విద్యాసాగర్, హైదరాబాద్ నగర జన సమీకరణ సమన్వయ కమిటీలో మంత్రులు తలసాని, పద్మారావు, ఎమ్మెల్సీ మైనంపల్లి, మాజీ మంత్రి దానంను నియమించారు.