తెలంగాణ

నాలుగేళ్ల పాలనపై ప్రగతి నివేదిన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 25: హైదరాబాద్‌లో 25లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. జన ప్రవాహంతో కూడిన ఈసభ చారిత్రాత్మకం కానుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన అంశాలను 99.9శాతం అమలు చేశామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 37 కులాల వారికి 10ఎకరాల్లో రూ.10కోట్లతో ఆత్మగౌరవ కేంద్రాలను హైదరాబాద్ నగరంలో నిర్మిస్తుమని అన్నారు. సెప్టెంబర్ 2న తలపెట్టిన ప్రగతి నివేదిన సభలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగేళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరిస్తామన్నారు. శనివారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంపై సమున్నత స్థానంలో నిలిపేవిధంగా ప్రగతి నివేదన సభ ఉంటుందని తెలిపారు. నాలుగేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ 300 పైచిలుకు నిర్ణయాలు తీసుకుని జివోలు జారీ చేశారని అన్నారు. ఎన్నికల ప్రణాళిక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లాగా పాటించామని, ఎన్నికల హామీలను 99.9శాతం అమలు చేయగా, ఎన్నికల ప్రణాళికలో లేని అంశాలను, ఎవరూ అడగని కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24గంటల కరెంట్, ఆరు కిలోల బియ్యం, హాస్టళ్లల్లో సన్న బియ్యం అందిస్తున్నామని, దసరా, క్రిస్మస్, రంజా న్ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
పద్నాలుగేళ్లుగా ఉద్యమకాలంలో, అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో చెప్పిన మాటలను తూ.చ తప్పకుండా అమలు చేశామన్నారు. నాలుగేళ్ల పాలనపై ప్రజలకు వివరించేందుకు సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి 2.50లక్షల మంది తరలిస్తున్నామని అన్నా రు. ఇందుకోసం 1250 ఆర్టీసీ బస్సు లు, 1500 ప్రైవేట్ బస్సులు, 1400 విద్యా సంస్థలకు చెందిన బస్సులతోపాటు ఇతరత్ర వాహనాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా ప్రజలను తరలిస్తామని తెలిపారు. సభ విజయవంతం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒకరిని ఇన్‌చార్జిగా నియమించడం జరిగిందని, వీరు నేటి నుంచి నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, జన సమీకరణకు సమాయత్తం చేస్తారని అన్నారు.
నివేదన సభ సాయంత్రం 4గంటలకు ప్రారం భం కానుండగా, ఉదయం 9 గంటల నుంచి కరీంనగర్ జిల్లా నుంచి వాహనాలు బయలుదేరుతాయని, బస్సుల్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీమల దండులా కదిలివచ్చి ప్రగతి నివేదక సభను విజయవంతం చేయాలని మంత్రి రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ భానుప్రసాద రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్