తెలంగాణ

కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ. జీవన్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలను ఆమోదింపచేసుకోవడానికే కేసీఆర్ జోనల్ విధానాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయం నిర్మాణం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.