తెలంగాణ

ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం 30న కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ప్రభుత్వం ఫీజుల రీయంబర్స్‌మెంట్ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 30 తేదీన బిసి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి విద్యార్థులకు ఫీజులు చెల్లించడంలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేస్తున్నారు అంటూ అన్ని జిల్లా కలెక్టర్, ఆర్‌డిఓ కార్యాలయాలను ముట్టడించడానికి బిసి సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. దాదాపు ఎనిమిది డిమాండ్‌లతో కూడిని వినతిపత్రాలను ప్రభుత్వనికి సమర్పించినా అందుకు సానుకూల నిర్ణయం రాకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ విద్యార్థిలకు పిలుపు ఇచ్చారు.
కేంద్రంలో ఉన్న 14 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 14 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా వాయిదా వేస్తోందని వాటిని అమలు చేయడానకి బీజేపి ప్రభుత్వం చొరవ చూపించాలని సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, అసెంబ్లీలో బీజేపి ప్రతిపక్ష నేత కిషన్‌రెడ్డిలకు వినతిపత్రం అందచేశారు. సోమవారం బిసి విద్యార్థుల డిమాండ్‌లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.