తెలంగాణ

నేడు ఎస్‌ఐ రాతపరీక్షల ‘కీ’ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ పోలీస్‌శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ పోస్టులకు రాతపరీక్షలు ఆదివారం జరిగాయి. వీటికి సంబంధించిన రాతపరీక్షల ‘కీ’ని సోమవారం విడుదల చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి, పోలీస్ శాఖ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జరిగిన పరీక్షల్లో దాదాపు1217 మంది ఎస్‌ఐలను భర్తీ చేయబోతున్నారు. పరీక్షలకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 1,78019 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. అత్యధికంగా వరంగల్, నల్లగొండ కేంద్రాల్లో అభ్యర్థులు హాజరు అయినట్లు తెలిపారు. ఎస్‌ఐ పోస్టులకు 188482 మంది దరఖాస్తు చేసుకోగా 178010 మంది హాజరు అయ్యారు.