తెలంగాణ

రోడ్డు ప్రమాదాలను సామాజిక దృష్టితో చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రోజురోజుకి రోడ్డు ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని సామాజిక దృష్టితో చూడాలని, అలాగే ప్రజారోగ్య సమస్యగా గుర్తించినప్పడే ప్రమాదాలను నివారించవచ్చునని తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం మహేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతి రోజూ రహదార్లపై వెళుతున్నప్పుడు కళ్ళ ముందు జరిగే ప్రమాదాలను చూచిచూడనట్లుగా వెళ్ళకుండా జరిగిన ప్రమాద సంఘటనపై సమీపంలో ఉన్న ఆసుపత్రులకు సమాచారం అందివ్వడంతో తమవంతు కర్తవ్యంగా పని చేసినప్పుడే సామాజిక ధర్మాన్ని పాటించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. 30 వసంతాలు పూర్తి చేసుకున్న అపోలో ఆదివారం ఘనంగా సంబురాలు జరుపుకుంది. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి నుంచి కెబిఆర్ పార్కు వరకు నిర్వహించిన వాకాథాన్‌ను రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి జెండాఊపి ప్రారంభించారు. భారత దేశంలో ప్రతియేటా 70వేల మంది రోడ్డు ప్రమాదాలతో మృత్యువాత పడడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సైతం రోజు సగటున ఏడు రహదారి ప్రమాదాలు, ఏడుగురు గాయపడడం జరుగుతోందని వీటి అరికట్టడానికి ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ 1988 ఆగస్టు 27న హైదారబాద్ శివారుల్లో కొండగుట్టపై 150 పడకల హాస్పిటల్‌గా ప్రారంభమైన అపోలో నేడు 70 దేశాల్లో వైద్యసేవలు అందిస్తూ తన ఉనికిని ప్రపంచ పటంలో ఘనంగా చాటుకుంటున్నదని ఆమె నొక్కి చెప్పారు. అపోలో 30 సంవత్సరాలుగా రోగులకు ప్రపంచశ్రేణి సంరక్షణను అందిస్తూ, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ప్రయాణించేందుకు అపోలో చేస్తున్న సేవలును దృష్టిలో ఉంచుకుని నేడు సంబురాలు జరుపుకోవడం అపోలో కళలు నెరవేరుతున్నాయని ఆమె అన్నారు.
అపోలో హాస్పిటల్స్ నేడు గ్లోబల్ హెల్త్‌కేర్‌కు ఒక గమ్యస్థానంగా నిలిచిందని ఆమె గుర్తు చేశారు. పోలీసుల సహకారంతో నగరానికి చెందిన వివిధ వర్గాల ప్రజలకు ‘బెసిక్ లైఫ్ సపోర్ట్’పై శిక్షణ ఇస్తున్నట్ల చెప్పారు. భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి 1983లో చెన్నైలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహిత డాక్టర్ ప్రతాపరెడ్డి ప్రారంభించారని ఆమె గర్తు చేశారు. అపోలో వైద్యసేవలు దృష్టిలో పెట్టుకుని భారతదేశం తొలిసారిగా ఒక స్మారక స్టాంప్‌ను విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ అపోలో చేస్తున్న వైద్య సేవలు సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావడం చూస్తే సేవాభావాన్ని గుర్తు చేస్తుందన్నారు. అపోలో తీసుకువస్తున్న బేసిక్‌లైఫ్ సపోర్ట్‌ను నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు చేయడానకి కృషి చేస్తామన్నారు.

చిత్రం..అపోలో ఆసుపత్రి స్థాపించి 30 వసంతాలు పూర్తి అయన సందర్భంగా జూబిలీహిల్స్‌లోని అపోలో నుంచి కేబీఆర్ పార్కు వరకు ఆదివారం నిర్వహించిన వాకాథాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు