తెలంగాణ

కాళేశ్వరం రీ-ఇంజనీరింగ్ భారీ తప్పిదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ ఇంజనీరింగ్ అద్భుతం కాదని, అదో భారీ ఇంజనీరింగ్ తప్పిదమని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజెఎసి) నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. 3కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌పై వాదనలు-వాస్తవాలు2 అనే అంశంపై టీజెఎసి ఆదివారం అఖిల పక్ష నేతలు, ఇంజనీరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మొదట టీజెఎసి చైర్మన్ రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, నీటి లభ్యత పుష్కలంగా ఉన్న చోట లేదని...లేని చోట ఉందని చెబుతూ తమ ఇష్టారాజ్యంగా ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేసిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన అనుమానాలపై ప్రభుత్వాన్ని ఇంజనీరింగ్ నిపుణులు నిలదీయాలని బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఈ ప్రాజెక్టుపై జేఎసి లేవనెత్తిన సందేహాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడాన్ని మొదట వ్యతిరేకించింది టీడిపీనే అని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ గుర్తు చేసారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టులకు రీ డిజైన్ అనడం, అంచనాలు పెంచడం ప్రజలపై భారం మోపడమేనని కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ పేరిట అంచనాలు పెంచి జేబులు నింపుకోవడమేనని సిపిఐ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఏం ఒరగబెట్టారని ప్రగతి నివేదన సభలో ప్రజలకు చెబుతారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు డీపిఆర్ అనేది ఎన్నికల్లో రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చే హామీ వంటిదని రిటైర్డు ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ప్రాజెక్టు అనుకూల, వ్యతిరేకుల మధ్య వాగ్విదానికి దారితీసింది. ఆ తర్వాత జేఎసి చైర్మన్ రఘు ప్రసంగిస్తుండగా కొందరు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో రసాబాస జరిగింది.

చిత్రం..కాళేశ్వరం ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్‌పై వాదనలు-వాస్తవాలు అనే అంశంపై టీజేఏసీ ఆదివారం అఖిల పక్ష నేతలు, ఇంజనీరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి