తెలంగాణ

కనిపించే దేవుళ్లు వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: ప్రజలు కనిపించే దేవుడిగా డాక్టర్లను భావిస్తారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రోగికి వ్యాధి నయమైతేనే డాక్టర్‌కూ ఆనందం కలుగుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ‘నాతన్స్ లర్నింగ్ ఫోరం’ (ఎన్‌ఎల్‌ఎఫ్) నాయకత్వ అవార్డుల-2018 ఉత్సవంలో మంత్రి నాయిని పాల్గొన్నారు. మదర్ థెరిస్సా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని అన్నారు. దేశంలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ప్రసంగిస్తూ వైద్య, విద్య, సామాజిక, క్రీడలు, మీడియా రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులు అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఆయా రంగాల వారిని ప్రోత్సహించేందుకు చాలా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఎస్‌ఎల్‌ఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ అశీష్ చౌహన్, సంస్థ కో-కన్వీనర్, విశ్రాంతి ఐఏఎస్ అధికారి అరుణ డొర్కాస్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా దేవం కోసం ప్రాణాలర్పించిన మేజర్ పద్మపణి ఆచార్య సతీమణి చారులత ఆచార్యకు, వైద్యులు డాక్టర్ దిలీప్ మత్తాయ్, డాక్టర్ సునీల్ చండి, డాక్టర్ ఫిలిప్ ఫిన్సీ, డాక్టర్ బిజు జార్జ్, డాక్టర్ బిమల్ చార్లెస్, డాకట్టర్ డెబాషిస్ దాండ, డాక్టర్ వినోద షా, డాక్టర్ జివి రావు, డాక్టర్ గౌరీ శంకర్, డాక్టర్ జాన్ ప్రమోద్, డాక్టర్ సందీప్ లక్టాకియా, డాక్టర్ శైలేష్ చార్లెస్, డాక్టర్ ఎజికే గోఖలే, డాక్టర్ మంజులా అనగాణి, డాక్టర్ మమ్మెన్ చండి, డ ఆక్టర్ జార్డ్ చండి, జర్నలిస్టులు బి.జాన్ రాస్, దీన్ దయాళ్, సామాజిక కార్యకర్తలు సిస్టర్ రోసి చంద్ర, ఎడ్వర్డ్ సామేల్, హరోన్ తదితరులకు అవార్డులు ప్రదానం చేశారు. డాక్టర్ విమన్ బింద్ర, డాక్టర్ సుజాతా చౌహన్ పాల్గొన్నారు.

చిత్రం..మేజర్ జనరల్ పద్మఫణి ఆచార్య సతీమణి చారులత ఆచార్యకు లీడర్‌షిప్
అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి