తెలంగాణ

కేటీఆర్‌కు హెల్మెట్ బహూకరించిన కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌కు కవిత హెల్మెట్‌ను బహుకరించారు. రక్షా బంధన్ స్ఫూర్తితో సోదరుల ప్రాణాల రక్షణకు ప్రతి సోదరి హెల్మెట్ సమర్పించాలని కవిత పిలుపునిచ్చారు.
ఇలా ఉండగా రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన చిన్నారిని ఇంటికి పిలుపించుకుని మంత్రి కేటీఆర్ రాఖీ కట్టించుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన 9 సంవత్సరాల దివ్వ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు పోగొట్టుకుంది. దివ్వ తండ్రి రిక్షా కార్మికుడు కావడంతో చికిత్సకు డబ్బులు లేని విషయం తెలుసుకుని ఆ చిన్నారికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆపద సమయంలో అన్నలా ఆదుకున్న మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టాలన్న ఆకాంక్షని దివ్య వ్యక్తం చేయడంతో ఆ చిన్నారిని ప్రగతి భవన్‌కు ప్రత్యేకంగా పిలిపించుకుని రాఖీ కట్టించుకున్నారు. దివ్యకు కృత్రిమ కాలు, తండ్రికి ఆటోను ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు.

చిత్రం..రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు రాఖీ కడుతున్న ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత