తెలంగాణ

పర్యాటక కేంద్రంగా రంగనాయక్‌సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 26 : రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వచ్చే వానాకాలం నాటికి రంగనాయక్‌సాగర్‌ను నిండుకుండలా నింపి ప్రాజెక్టులు చేపలు పట్టుకునే హక్కు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట మున్సిపాల్టీలోని 29వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఇమాంబాద్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం 6కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల నుండి 101 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మహిళ సంఘాలకు 1750 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా అర్హులైన రైతులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రక్షాబంధన్ పండుగను ప్రతి ఒక్కరు వృక్షా బంధన్‌నుగా మార్చి విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈనెల 28న సిద్దిపేట మున్సిపాల్టీలో జరిగే హరిత పండుగను ప్రతి ఒక్కరు భాగస్వాములై పెద్దఎత్తున మొక్కలు నాటాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, రైతుసమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, కౌన్సిలర్లు ఉమారాణి ఐలయ్య, ఉమారాణి శ్రీనివాస్, రాజయ్య పాల్గొన్నారు.