తెలంగాణ

ఏడుపాయలకు భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. ఆలయ ప్రాంగణంలోని షవర్ బాత్‌లు, ఘణపురం ఆనకట్టలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో వివిధ రకాల పూలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారు కోటి సూర్యప్రభ కాంతులతో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. తెలంగాణలోని హైదరాబాద్ జంట నగరాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువల లక్షలాది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణం ఎటు చూసిన జనసంద్రమే కనిపించింది. రద్దీ విపరీతంగా ఉండటం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో దుర్గామాత ఆలయానికి వెళ్లెదారి కిటకిటలాడింది. భక్తులు కాలికి గజ్జెలు కట్టి, జుట్టు విరబోసుకొని, నెత్తిపై బోనం ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు వ్రాసుకొని, వేపకొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు వేసుకొని, చేతిలొ కొరడా పట్టుకొని డప్పుల దరువులకు అనుగుణంగా, లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఉరేగింపులుగా వనదుర్గామాత ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు, పోతరాజుల నృత్యా లు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించారు. మొక్కుబడుల్లో భాగంగా అనేక మంది భక్తులు దుర్గామాతకు చీర, రవిక, గాజులు సమర్పించి ఓడిబియ్యం పోశారు. కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ మెహన్‌రెడ్డి, ఆలయ డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మలు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు.
చిత్రం..పూజలందుకుంటున్న వనదుర్గామాత