తెలంగాణ

500 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లాలో 500 ఎకరాల్లో పారిశ్రామిక కారీడార్ ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సెప్టెంబర్ 4న మలేసీయ కంపెనీకి కేటాయించిన భూమిలో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వివిధ దేశాలకు చెందిన ముఖ్యమైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్‌లో ఆదివారం రాత్రి నియోజక వర్గంలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 59 జీవో పట్టా పత్రాలను లబ్థిదారులకు అందచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్‌లో అసైన్డ్ భూములు కోల్పోయిన వారికి సైతం పరిహారం అందించినట్లు తెలిపారు. నియోజక వర్గంలోని సిద్దిపేట రూరల్, నంగునూర్, చిన్నకోడూరు, మండలాల లబ్ధిదారులు 107 మంది లబ్థిదారులకు 96 లక్షల, 12వేల 412 మేర చెక్కులను అందచేశారు. జీవో 59 కింద 75 మంది అర్హులైన లబ్థిదారులకు భూమి ధృవీకరణ హక్కు పత్రాలను అందచేశారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక పేద ప్రజానికానికి అనకే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మొదట 50వేలు, తర్వాత 75 వేలు, ఇప్పుడు లక్ష 116 రూపాయల చెక్కులను పేదింటి ఆడపిల్లల పెళ్లికి అందచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్ల పెళ్లి ఏ తండ్రికి భారం కాకుడని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీలు శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మండల అధ్యక్షుడు పరకాల మల్లేశం, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్‌లు నరేందర్‌రెడ్డి, కోల రమేశ్, జడ్పీటీసీ కమల రాంచంద్రం, ఓఎస్‌డి బాలరాజు, తహశీల్దార్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వార్డుల్లో ఆదివారం ఉదయం మంత్రి హరీష్‌రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మొదటగా 28వ వార్డులో సీతారామనగర్‌లో 20 లక్షలతో నిర్మించిన వరద కాలువ నిర్మాణ పనులుకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆనంతరం 31, 34 వార్డుల్లో నాసర్‌పురాలో 40 లక్షలతో నిర్మించనున్న వరదకాలువ పనులను ప్రారంభించారు. 9వ వార్డు పరిధిలోని కుషాల్‌నగర్‌లో 25లక్షలతో నిర్మించనున్న వరద కాలువకు, రంగదాంపల్లిలో ప్రధాన రహాదారిలో 26లక్షలతో నిర్మించనున్న వరద కాలువ పనులను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఆనంతరం ఇమాంబాద్‌లోని 29వ వార్డులో నూతనంగా 10లక్షలతో నిర్మించిన యాదవసంఘం, 10లక్షలతో నిర్మించిన మున్నూరుకాపు సంఘం, 15లక్షలతో నిర్మించిన మహిళ మండలి భవనాలను ప్రారంభించారు. అలాగే 20లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్, 10లక్షలతో నిర్మించనున్న రెడ్డి భవనం, 10లక్షలతో నిర్మించనున్న ముదిరాజ్ కమ్యూనిటీ భవనాలను శంకుస్థాపనలు చేశారు. ఆంతకుముందు మంత్రి హరీష్‌రావుకు రంగధాంపల్లి, నాసర్‌పురాలో ఘన స్వాగతం పలికారు. ఆనంతరం ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, రైతుసమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగనాగిరెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు పాల సాయిరాం, జంగిటి కనకరాజు, బోనాల నర్సింలు, మామిండ్ల ఐలయ్య, గురజాల శ్రీనివాస్, రాజయ్య, ముత్యాల కనకయ్య, వంగ తిరుమల్‌రెడ్డి, ఓఎస్‌డి బాలరాజు పాల్గొన్నారు.
చిత్రం..మంత్రి హరీష్‌రావుకు తిలకం పెడుతున్న మహిళలు