తెలంగాణ

సీఎం ‘ఇలాకా’ ప్రత్యేక అధికారిగా ముత్యంరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గానికి చెందిన ‘గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ’ (గడా) ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కలెక్టర్ అయిన ఏ. ముత్యంరెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రణాళికాశాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు పేరుతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఈ పోస్టులో పనిచేసిన హనుమంతరావును సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేస్తూ మూడురోజుల క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి. గడా స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం అయిన ఏ. ముత్యం రెడ్డి సిద్ధిపేట ఆర్‌డీఓగా పనిచేస్తూ, శుక్రవారమే పదవీ విరమణ చేశారు.
వాస్తవంగా ముత్యంరెడ్డి ఆర్‌డిఓగా పనిచేస్తూ రెండేళ్ల క్రితమే పదవీ విరమణ చేసినప్పటికీ, ఆయన సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ఆర్‌డీఓ పదవీ విరమణ తర్వాత సర్వీసును పొడిగించడం ముత్యంరెడ్డితోనే మొదలైందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆర్‌డీఓగా ముత్యంరెడ్డి సర్వీసును ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగించినతర్వాత శుక్రవారం పొడగింపు కూడా గడువు ముగిసింది. ఆర్‌డీఓగానే ఆయన సర్వీసును మళ్లీ పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. ఈలోగా గడా ప్రత్యేక అధికారి పోస్టు ఖాళీ అయింది. గడా ప్రత్యేక అధికారిగా పనిచేసిన హనుమంతరావును సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. కేసీఆర్ తన సొంత నియోజక వర్గం అభివృద్ధికోసం ఏర్పాటు చేసిన గడాకు మంచి అధికారిని వేసుకోవాలని భావించారని తెలిసింది. ముత్యంరెడ్డి అందరితో కలుపుకోలుగా ఉంటారని, వేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటారని పేరు తెచ్చుకున్నారు. సిద్ధిపేట ఆర్‌డీఓగా కూడా ముత్యంరెడ్డిని ప్రత్యేకంగా కేసీఆర్ నియమించుకున్నారని తెలిసింది. మళ్లీ ఆయన సేవలను గడా ద్వారా వినియోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో గడా బాధ్యతలు అప్పగించారు. గడా ద్వారా దాదాపు వెయ్యికోట్ల రూపాయలపైగా పనులు జరుగుతున్నాయని తెలిసింది. విద్యాసంస్థల భవనాల నిర్మాణం, వైద్య సంస్థల భవనాల నిర్మాణంతో సహా అనేక శాఖలకు సంబంధించిన భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ భవనాల్లో చాలా వరకు పూర్తయ్యే దశలో ఉండగా, మరికొన్ని ఐదారు నెలల్లో పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఉండగా హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) తరహాలోనే గజ్వేల్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు కూడా నిర్మాణ దశలో ఉంది.
ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అందుకే గడా ప్రత్యేక అధికారిగా ముత్యంరెడ్డిని ఏరికోరి నియమించుకున్నట్టు తెలిసింది.