తెలంగాణ

ఖాళీ అవుతున్న ముంపు గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లకొండ/ మాచవరం, సెప్టెంబర్ 1: పులిచింతల ప్రాజెక్టుకు నీరు చేరుతున్న దృష్ట్యా ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి 5 సంవత్సరాలు గడిచినా ఇంకా మెట్ట ప్రాంతాలను నమ్ముకుని ఉన్న 250 కుటుంబాలను రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం ఖాళీ చేయించారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ, మాచవరం మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలను తరలించారు. పులిచింతల ముంపు గ్రామాలైన బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెం, బోదనం, కేతవరం, చిట్యాలతండా, కోనూరు, పులిచింతల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ప్యాకేజీలు ఇచ్చి పునరావాస కేంద్రాలు నిర్మించారు. అయినా బోదనం, కేతవరం, చిట్యాల గ్రామాల్లో ఇప్పటికీ కొంతమంది నివశిస్తున్నారు. వారిని అధికారులు పలుమార్లు హెచ్చరించినా గ్రామాలను వదిలివెళ్లలేదు. దీంతో శనివారం గుంటూరు ఆర్డీవో వీ వీరబ్రహ్మయ్య ఆధ్వర్యంలో పిడుగురాళ్ల సిఐ సుబ్బారావు, తహశీల్దార్ కుటుంబరావు తమ సిబ్బందితో ట్రాక్టర్లు, ఆటోలు ఏర్పాటుచేసి బలవంతంగా ఖాళీ చేయించారు. ఇప్పటికే ప్రాజెక్టులో 11 టీఎంసీల నీరు ఉండగా త్వరలో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని ఆర్డీవో తెలిపారు. రైతులు 1000 ఎకరాల్లో పత్తి, కందితో పాటు మిరప పంట కూడా సాగుచేశారు. ఎకరాకు 8 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని, 80 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని, ప్రజలు పునరావాస కేంద్రాల వద్దనే ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆర్డీవో సూచించారు. అదే విధంగా మాచవరం మండలంలో పులిచింతల ముంపుగ్రామాలైన రేగులగడ్డ, వెల్లంపల్లి గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని తహశీల్దార్ తుపాకుల మస్తాన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు ఈ రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలని తహశీల్దార్ తెలిపారు. పరిహారం కన్నా ప్రాణాలు ముఖ్యమని, పులిచింతలలో నీరు పూర్తిస్థాయిలో నింపితే గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని, జాలర్లు చేపల వేటకు వెళ్ళవద్దని, పడవలు ప్రయాణాలు కొనసాగించవద్దని ఎస్‌ఐ జగదీష్ హెచ్చరించారు.