తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా విద్రోహ దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: సీపీఎస్ పథకాన్ని తరిమికొట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు శనివారం రాష్టవ్య్రాప్తంగా విద్రోహదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా జిల్లా కేంద్రాల్లో డీఈఓ కార్యాలయాలను, రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. టీచర్లు చాలా వరకూ సామూహిక సెలవులు పెట్టి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల ప్రాంగణానికి చేరుకుని నిరసన , మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్య- ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాలను ఎండగడదామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. మహాసభలు నిర్వహించగా వక్తలు సీపీఎస్ పథకాన్ని నిరసించారు. టీచర్లు ఐక్యతను కాపాడుకోవాలని, సీపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాడాలని వారు సీపీఎస్ ఐక్య కార్యాచరణ సంఘం నేతలు పేర్కొన్నారు.
ఇఫ్లూలో ఐటీపీ శిక్షణ
వివిధ దేశాల మధ్య సంబంధాలను ప్రోత్సహించడానికి, దేశాల మధ్య మంచి సంబంధాలను పెంపొందించేందుకు ద్వైపాక్షిక సంబంధాలు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఐటీపీ శిక్షణ అందిస్తున్నట్టు ఆంగ్లం- విదేశీ భాషల విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆంగ్లం- విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో 59వ ఐటీపీ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐటీపీ కోర్సు ద్వారా ఇంటర్నేషనల్ విద్యార్ధులకు ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుతున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బాల భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కోర్సులో 23 దేశాల నుండి 85 మంది విద్యార్ధులు పాల్గొన్నట్టు వీసీ చెప్పారు. శిక్షణ ముగించిన వారికి వీసీ శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ విద్యార్థులు స్థానిక ఆచార వ్యవహారాలను కూడా తెలుసుకోవాలని సూచించారు.