తెలంగాణ

సమస్యల సుడిగుండంలో టీచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రభుత్వంలోని ఏ విభాగంలో పనిచేసిన వారైనా ఒక హోదాలో ఉద్యోగంలో చేరారంటే చాలు పదవీ విరమణ చేసే సమయానికి కనీసం రెండు నుండి నాలుగు పదోన్నతులు పొందుతుండగా, టీచర్లు మాత్రం టీచర్‌గా చేరి, టీచర్‌గానే రిటైర్ అవుతున్నారు. సర్వీసు రూల్స్ లేక, సక్రమంగా పదోన్నతులు లభించక, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక, ఎంత చెప్పినా ఫలితాలను సాధించలేక ఉపాధ్యాయులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తెలివైన పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోవడం, విద్యావ్యాసంగంపై ఆసక్తిలేని పేద పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తుండటం, వారిని తీర్చిదిద్ది భాషానైపుణ్యాలను నేర్పించి, మంచి మార్కులు సాధించే విద్యార్ధులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకు కత్తిమీద సవాలుగా మారింది. కొన్ని స్కూళ్లలో మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, దాదాపు 80 శాతం స్కూళ్లలో టీచర్లకు సరైన మరుగుదొడ్లు కూడా లభించని దురవస్థ నెలకొంది. టీచర్స్ రూమ్స్ లేక స్ర్తి, పురుషులకు ఒకే రూమ్‌ను టీచర్సు రూమ్‌గా కేటాయించడంతో మహిళా టీచర్లు ప్రైవసీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతో చదువుకుని, ఏదో బోధించాలని స్కూళ్లలో టీచర్లుగా నియమితులైనా అనుకున్న లక్ష్యాలను సాధించకలేపోతున్నారు. ఏళ్ళ తరబడి పరీక్షలు నిర్వహిస్తున్నా, ఉన్నతాధికారుల వింతపోకడలతో ప్రతి ఏటా పరీక్షలలో గందరగోళం ఏర్పడుతోంది. బదిలీల్లో ప్రభుత్వం బయటికి చెప్పేంత పారదర్శకత పాటించకపోవడం, పాఠశాల స్థాయిలో టీచర్ల సంఘాల రాజకీయాలు, రాజకీయ నేతల జోక్యం, ఆధునిక బోధన పద్ధతులపై ఎవరికీ పట్టింపు లేకపోవడం, శాస్తవ్రిజ్ఞాన అంశాలను బోధించాలంటే సరైన ల్యాబ్‌లు లేకపోవడం , ల్యాబ్‌లున్నా, ఉపకరణాలు, ద్రావణాలు అందుబాటులో లేక టీచర్లు నిస్సహాయులు అవుతున్నారు.
చాలా శాఖల్లో ఉద్యోగంలో చేరిన ఏడెనిమిదేళ్లకు ఒక పదోన్నతి పొందుతుండగా, 20 ఏళ్లు గడచినా సెకండరీ గ్రేడ్ టీచర్లుగానే బతుకు ఈడుస్తున్న టీచర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇంకో పక్క అధికారుల పీడన కూడా ఎక్కువైందని టీచర్లు వాపోతున్నారు.
ప్రాధమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తికి ఇంటర్మీడియట్ పాసై డిఇడీ చేస్తే చాలు, ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ చేసి, బిఇడీ చదివితే చాలు అయినా పీజీలు , పీహెచ్‌డీలు చేసి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా చేరి, అదే హోదాలో రిటైరవుతున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం విద్యారంగంలో ప్రయోగాలు చేయడంతో పాఠశాల విద్యా బోధన గందరగోళానికి గురవుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన సీసీఈ పద్ధతి పుణ్యమా అని టీచర్లు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. చివరికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన వారు సైతం ఎలాంటి ఆదరణ, ప్రాధాన్యత లేక ఎలాంటి వెయిటేజీ లేక ఆదర్శ గురువులకు సైతం ఏది ఆదరణ అని ప్రశ్నిస్తున్నారు.
జాతీయ ఉత్తమ పురస్కార గ్రహీతలకు రెండేళ్లు పదవీ విరమణ వయోపరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసి 37 ఏళ్లు గడుస్తున్నా నేటికీ తెలుగు రాష్ట్రాల్లో అవి అమలుకావడం లేదని ఆదర్శగురువులు వాపోతున్నారు. జాతీయ స్థాయిలో రాష్టప్రతి చేతులు మీదుగా సెప్టెంబర్ 5వ తేదీన అవార్డులను అందుకుంటున్న వారికి ఆదరణ లేకపోవడంతో ఉత్తమ ఉపాధ్యాయులు మనోవ్యధకి గురవుతున్నారు. అవార్డు పొందిన వారి సర్వీసును రెండేళ్లు పొడిగించాలని కేంద్రం 1981 జూన్‌లో మార్గదర్శకాలను జారీచేసిందని ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ అంశంపై గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకపోయిందని, పురస్కార గ్రహీతలకు ఐదేళ్లకు ఒకసారి దేశంలో పర్యటించేందుకు చెల్లింపు సెలవులు ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు ఇచ్చినా అవి ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఆంధ్రాలో 20వేలు ఇస్తుండగా, తెలంగాణలో మాత్రం 10వేలు ఇస్తున్నారని, ఇలాంటి అనేక లోపాలను తొలగించి ఉత్తమ ఉపాధ్యాయులను ఆదరించాలని ఆయన కోరారు.