తెలంగాణ

తెరాస హత్యా రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో తెరాస హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో సోమవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్నీ పూర్తి చేయలేదని, కమీషన్ల కోసం మాత్రమే పథకాలను అట్టహసంగా ప్రారంభించారని అన్నారు. కార్యకర్తలే పార్టీకి పెద్ద దిక్కని వారిని కాపాడుకోవల్సిన బాధ్యత నాయకులపై ఉందని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం నుండి చిరుమర్తి లింగయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. మనస్పర్థలను పక్కకు పెట్టి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం పని చేయాలని కోమటిరెడ్డి సూచించారు. చిరుమర్తి లింగయ్య తమను పట్టించుకోలేదని పలువురు సమావేశంలో ప్రస్తావించగా మరోసారి అలాంటిది జర్గకుండా చూస్తానన్నారు. చిరుమర్తిని గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని, ఏ హోదాలో ఉన్నా నా రాజకీయ అభివృద్ధికి తోడ్పాటునందించిన చిట్యాల మండలాన్ని మరువనని అన్నారు. అనంతరం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఎమ్మెల్యేగా అశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా మరోసారి తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

చిత్రం..చిట్యాలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి