తెలంగాణ

బీసీ మహిళకు టికెట్టు రాకుండా అడ్డుపడుతున్న మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారి తల్లినే కాక బీసీ మహిళనైన తనకు హుజూర్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టికెట్టు రాకుండా జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి వద్ద అడ్డుపడుతున్నారని నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కే. శంకరమ్మ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన నియోజకవర్గ టిఆర్‌ఎస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తన వెనుక పది మంది కూడా కార్యకర్తలు లేరని సీఎం కేసీఆర్‌కు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చినందువల్లే తనకు మొదటి జాబితాలో టికెట్టు రాకుండా నిలిపివేశారని ఆమె అన్నారు. నియోజకవర్గంలో తాను 45 వేల పార్టీ సభ్యత్వాలు చేసి ఆన్‌లైన్‌లో ఉంచానని.. అసలు శానంపూడి సైదిరెడ్డికి పార్టీలో సభ్యత్వమే లేదని అలాంటి వ్యక్తికి కేసీఆర్, కేటీఆర్‌లు టికెట్టు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.
త్వరలో తాను పెద్ద బహిరంగ సభ నిర్వహించి పార్టీ అధ్యక్షుడికి సత్తా చాటుతానని.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 50 వేల మెజార్టీతో గెలుస్తానని అన్నారు. తనకు అన్యాయం చేయనని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని తాను బతికినా, చచ్చినా హుజూర్‌నగర్ నుండే పోటీ చేస్తానని సైదిరెడ్డి లాంటి వారిని వేల మందిని చూశానని 500 రూపాయలు ఇచ్చి కార్యకర్తలను కొనుగోలు చేయటం కాదని గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉండి పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నానని 2009లో జగదీశ్వర్‌రెడ్డి హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఇక్కడి నుంచి కనపడకుండా వెళ్లిపోయారని 2014లో తాను ఓడిపోయినా నియోజకవర్గంలో ప్రజల మధ్యనే పనిచేస్తూ ఉన్నానని శంకరమ్మ అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పై కొందరు వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్‌ఎస్ టికెట్టు ఎవ్వరికీ ఇంకా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ స్థానికులకే ఇస్తారని.. అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లామని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

చిత్రం.. టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జ్జి శంకరమ్మ