తెలంగాణ

హద్దులు దాటుతున్న ఛానల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఇటీవల జరుగుతున్న నేర సంఘటనలను కొన్ని టీవీ ఛానల్స్ సంచలన వార్తలుగా పదేపదే ప్రచారం చేయడాన్ని తెలంగాణ డిజిపి మహేందర్‌రెడ్డి తప్పుపట్టారు. ఛానల్స్ అత్యుత్సాహంతో నేర సంఘటనలను ప్రచారం చేయడంతో సమాజంలో భయబ్రాంతులు నెలకొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఛానల్స్ కార్యక్రమాలు చూస్తుంటే ప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలను పాటించడం లేదన్న అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. ప్రచార మాధ్యమాలు హద్దులు దాటి ప్రవర్తించడం సమాజానికి నష్టం కల్గుంతుందన్నారు. నేర వృత్తి అలవాటు పడిన వ్యక్తులు చాలా తక్కవగా ఉంటారని, టీవీ ఛానల్స్ చూస్తే మరోనేర సంఘటనకు ఉసిగొల్పుతున్నట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు. టీవీ ఛానల్స్ నియంత్రణ కోల్పోతే సమాజంలో మరిన్ని దారుణ సంఘటనలు పునరావృతం అవుతాయని, దీన్ని అరికట్టడానికి అన్ని టీవీ ఛానల్స్ యాజమాన్యాలు టీవీ రెగ్యులేటరీ చట్టాలకు లోబడి ప్రచారాలను చేయడానకి చొరవ చూపించాలని ఆయన హితవు పలికారు.