తెలంగాణ

రేపు గీతం స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఇస్రో చైర్మన్ కె శివన్‌కు ,సుప్రసిద్ధ శిల్పాచార్యుడు డాక్టర్ ఎక్కా యాదగిరిరావులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయాలని గీతం విశ్వవిద్యాలయం నిర్ణయించినట్టు ఛాన్సలర్ ప్రొఫెసర్ కే రామకృష్ణారావు, ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్ శివప్రసాద్‌లు తెలిపారు. ఈ నెల 22న నిర్వహించే 9వ స్నాతకోత్సవంలో వీరికి గౌరవ డాక్టరేట్లు ఇస్తామని, ఈ సందర్భంగా 1017 మంది విద్యార్ధులకు పట్టాలు అందజేస్తామని అన్నారు. ముగ్గురు పీహెచ్‌డీ పట్ట్భద్రులు, 45 మంది ఎంబీఎ, ఆరుగురు ఎంటెక్, 886 మంది బీటెక్ పట్ట్భద్రులు తమ పట్టాలు అందుకుంటారని చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పది మందికి బంగారు పతకాలు అందజేస్తామని అన్నారు. డాక్టర్ శివన్ శాటిలైట్ లాంఛింగ్ వెహికిల్ ప్రాజెక్టులోనూ, అంతరిక్ష రవాణా వ్యవస్థల ఇంజనీరింగ్‌లోనూ నిపుణులని, మిషన్ సంశే్లషణ, అనుకరణ, విమాన వ్యవస్థల విశే్లషణ, ధృవీకరణలో కూడా ఆయన నిష్ణాతుడని అనర్నారు. ఎక్కా యాదగిరిరావు భారీ రాతి శిల్పాలు, అతికించిన రాతి శిల్పాలు ఆయన ప్రసిద్థుడని అన్నారు. 22వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ యూనివర్శిటీ క్యాంపస్‌లోనే ఈ స్నాతకోత్సవం జరుగుతుందని వారు చెప్పారు.