తెలంగాణ

ఫీజుల బకాయిల కోసం కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఇంజనీరింగ్, మెడిసన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే 14 లక్షల మంది ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఇబీసీ విద్యార్థుల గత ఏడాది ఫీజుల బకాయిలు రూ.2200 కోట్లు వెంటనే చెల్లించాలని, బీసీ, ఇబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులుర మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లను, 64 ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, ఇతర నాయకులు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. ఆ రోజున విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఈ ఉద్యమంలో శాంతియుతంగా పాల్గొనాలని వారు కోరారు.