తెలంగాణ

మా కంటే ఎక్కువ గొడవలు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తమ పార్టీ కంటే ఎక్కువ అసంతృప్తులు, గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లో ఉన్నాయని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పోరాటం అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపైనేనని పొన్నం సోమవారం విలేఖరుల సమావేవంలో తెలిపారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు పార్టీలో అందరమూ కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది సీఎం ఆశావాహులు ఉన్నారని టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను పొన్నం ప్రస్తావిస్తూ, తొలుత టీఆర్‌ఎస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కవిత, హరీష్‌రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, ఈటల రాజేంద్రలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో బ్రోకర్లు, జోకర్లు ఎవరో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబితే పరిశీలిస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ నుంచి రాజ్‌గోపార్ రెడ్డి రాలేదని, నేరుగా 2009 ఎన్నికల్లో ఎంపీగా టిక్కెట్ ఇవ్వడం జరిగిందన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు వెళ్ళాలని, లేదా పార్టీ సమావేశంలో చర్చించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.