తెలంగాణ

వరవరరావు ఇల్లు ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు సామాజిక కార్యకర్త వరవరరావు ఇంటిని సోమవారం నాడు ముట్టడించారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, రాస్తారోకో నిర్వహించినట్టు ఏబీవీపీ కార్యదర్శి ఎల్ అయ్యప్ప తెలిపారు. దాడులు, హత్యలు మావోయిస్టుల సహజ లక్షణాలు అని, బాక్సైట్ వంకతో అమాయక గిరిజన నేతలను పొట్టనపెట్టుకున్నారని అన్నారు. తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధించుకోవాలనే నక్సలైట్లకు పౌర హక్కులు కావాలా అని నిలదీశారు. అర్బన్ నక్సలైట్లు దీనిపై ఏం మాట్లాడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల స్వార్ధ ప్రయోనాలకు అమాయక ప్రజలను నక్సల్స్ బలి చేస్తున్నారని అన్నారు.