తెలంగాణ

జీవిత ప్రతిబింబమే సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: సినిమాలు జీవిత ప్రతిబింబాలని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ పేర్కొన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ (డిపిఎస్‌ఎఫ్‌ఎస్)లో వివిధ కోర్సులను పూర్తిచేసి వృత్తినైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సాహిత్యం, నృత్యం, రంగస్థలం, సంగీతం, డిజైన్ వంటి కళలతో స్థిరమైన నిశ్చయం ఉన్నవారిలో స్పందనలు ఉంటాయని, ఈ సమకాలీన కళారూపాలను చిత్ర నిర్మాతలు అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎడిటింగ్, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్, ఆడియోగ్రఫీ తదితర కోర్సులను పూర్తి చేసిన వారికి ఈ సందర్భంగా సర్ట్ఫికేట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో తనకు టొరొంటోలోని చలనచిత్ర పాఠశాలలో గ్రాడ్యూయేషన్ రోజులు జ్ఞప్తికి వస్తున్నాయని అన్నారు. ఔత్సాహిక చిత్ర నిర్మాతలకు కూడా చలనచిత్ర పాఠశాలలు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. చిత్ర నిర్మాణం సమాజాన్ని మార్చడమే లక్ష్యం కారాదని, పైనున్న పది మంది, కింద ఉన్న పది మంది గురించి ఆలోచించకుండా మంచి కథ చెప్పడమే లక్ష్యం కావాలని పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అందరూ సినిమాలు తీయగలుగుతున్నారని, చెత్త కూడా వచ్చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ న్యూ పెరెస్పెక్టివ్ ఇన్ ఫిల్మ్ అండ్ మీడియా ప్రతినిధి నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉద్ధేశ్యపూర్వకంగా మీడియాను వినియోగించుకోగలగాలని అన్నారు. ప్రిన్సిపాల్ నందన్ బాబు తన అభినందనలు తెలిపారు. అంకురం దర్శకుడు ఉమామహేశ్వరరావు, కేవీరావు, వజ్జా శ్రీనివాసరావు తదితరులకు నందన్ బాబు ధన్యవాదాలు తెలిపారు.