తెలంగాణ

ప్రజాసేవకులనే బలిగొంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: అరకులో ప్రజాసేవకులైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు బలిగొనడం దారుణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలు మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలొదిలిన ఇద్దరు నేతలకు నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను ఇద్దరినీ హతమార్చడం తెలుగు ప్రజానీకాన్ని ఆవేదనకు గురిచేసిందని అన్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన వారు ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న సందర్భంగా వారిని మావోయిస్టులు చంపడాన్ని టీడీపీ ఖండిస్తోందని అన్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రజాసేవలో ఆటుపోట్లు సహజమని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకునే ఇటువంటి సంఘటనలను ధైర్యంతో ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుండి వారి కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారని అన్నారు. జాతీయ పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టపరిస్థితులను గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎదుర్కోవడం జరిగిందని అన్నారు. ఎంతో బాధ్యతాయుతంగా సేవలు అందించే నేతలను హతమార్చడం దురదృష్టకరమని చెప్పారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి ఇ పెద్దిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామా భూపాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి కొమ్మినేని సాయి వికాస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.