తెలంగాణ

అభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్ 24: అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శమని తెలంగాణ అపద్దర్మ ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలి అన్నారు. సోమవారం వనపర్తి నియోజక వర్గంలోని ఖిల్లాఘనపురం, పెద్ద మందడి, పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో సుమారు రూ.3కోట్ల అంచానతో అంబేద్కర్ భవనాలు, కమ్యూనిటి హల్స్, మైనార్టీ షాదిఖానాకు శంకుస్థాపన చేసిన అనంతరం వనపర్తి సంఘం పంక్షణ్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన నిర్మానానికి, షాదిఖానాకు సోమవారం రాత్రి డిప్యూటి సిఎం మహమూద్‌అలి, ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. అనంతరం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేవల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.