తెలంగాణ

సాంకేతిక లోపంతో నిలిచిన గోల్కొండ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, సెప్టెంబర్ 24: సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం సాయంత్రం కేసముద్రం స్టేషన్లో 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇంజన్‌తో పాటు లగేజీ బోగీలో సాంకేతికలోపం తలెత్తడంతో కేసముద్రంలో నిలిపివేశారు. ఇంటికనె్న దాటిన తరువాత లగేజీ బోగీ బ్రేక్‌రాడ్డు ఊడిపోయి రాళ్లకు తాకడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీనితో అప్రమత్తమైన డ్రైవర్లు కేసముద్రం వరకు రైలును తీసుకువచ్చి మరమ్మతులు నిర్వహించారు. ఈ కారణంగా 40 నిమిషాల పాటు కేసముద్రంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.