తెలంగాణ

‘ప్రణయ్ కుటుంబానికి ఎస్సీ ప్రయోజనాలు వద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 25: మిర్యాలగూడలో ఈనెల 14న హత్యకు గురైన ప్రణయ్ కుటుంబం క్రైస్తవ మతంలోకి మారినందున ఆ కుటుంబానికి ఎస్సీ ప్రయోజనాలు కల్పించవద్దని ఎస్సీ రిజర్వేషన్ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం డిమాండ్ చేశారు. మంగళవారం ఈమేరకు ఆర్డీఓ జగన్నాధరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ అనే యువకున్ని హత్య చేయడం బాధకరమని హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారితే బీసీ-సీకి గ్రూపుకి చెందుతారని జీఓఎంఎస్ నంబర్ 1793, 23-9-1970 చెప్తుతుందని కాని ప్రభుత్వ యంత్రాంగం హత్యకావింపబడిన ప్రణయ్‌ని ఎస్సీగానే చూస్తు ఆ కుటుంబానికి షెడ్యూల్ కులానికి సంబంధించిన సౌకర్యాలు కల్పించడం శోచనీయమన్నారు. ప్రణయ్ కుటుంబం వాస్తవంగా క్రైస్తవ మతంలో జీవిస్తున్న కుటుంబం అని వారికి ప్రభుత్వం ఏమైన ప్రయోజనాలు కల్పించాలనుకుంటే బీసీ-సీ గ్రూప్‌గానే కల్పించాలని సూచించారు. ప్రణయ్ అంత్యక్రియలు క్రైస్తవ మతాచార పద్ధతిలోనే జరిగాయని, అంతేకాకుండా ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కూడా క్రైస్తవులమని వెల్లడించారన్నారు. అయినప్పటికి అధికారులు మాత్రం వారికి బీసీ-సీగా కాకుండా ఎస్సీలగా పేర్కొంటు ఎస్సీల ప్రయోజనాలు ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎస్సీల అభివృద్ధి శాఖ నుండి రూ.4.12 లక్షలు ప్రణయ్ భార్యకు ఇచ్చారని క్రైస్తవులకు ఎస్సీల ప్రయోజనాలు చేకూర్చి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బీసీ-సీగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, డబల్‌బెడ్‌రూం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అంతేకాకుండా ప్రణయ్ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయకూడదన్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు గణేష్‌కుమార్, జ్ఞానేందర్, రమేష్, నాగేందర్, మల్లేష్, పెదమాం వెంకన్న ఉన్నారు.