తెలంగాణ

అదో..మాయల కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 26: మహాకూటమి ఓ మాయల కూటమి..అదో దుష్ట చతుష్టయం వంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రం నల్లగొండలో ఈ నెల 4న ఆపద్ధర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన సభాస్థలిని బుధవారం జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డ్డి మాట్లాడుతూ తెలంగాణను నిండా ముంచిన పార్టీలన్ని మహాకూటమిగా వస్తున్నాయని, ప్రజలు కూటమి పార్టీలను కట్టగట్టి కృష్ణానదిలో పడేసే రోజు దగ్గర్లో ఉందన్నారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి పార్టీలు అధికారం కోసం ఆఛరణ సాధ్యం కాని హామీలతో మరోసారి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాయని, అయనప్పటికి తెలంగాణ ప్రజల చేతిలో కూటమి పార్టీలకు ఓటమి ఖాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాకూటమి పార్టీలు ఒక్క సీటు కూడా గెలువబోవన్నారు. జిల్లాలోని పనె్నండ సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణ సాధించిన పార్టీగా ఆరుసీట్లు గెలిచిన తాము ఈ దఫా నాలుగేళ్ల పాలనలో దేశంలోనే ఆదర్శనీయ రీతిలో సాధించిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అండతో పనె్నండు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోదాడ, హుజూర్‌నగర్ స్థానాల టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు కాలేదని, బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ అధికార పార్టీగా ఉండటంతో సహజంగానే టికెట్లు ఆశించిన అభ్యర్థులు అధికంగా ఉన్నారని, అసంతృప్తి అంతా సర్ధుకుంటుందన్నారు. 4వ తేదిన జరిగే కేసీఆర్ నల్లగొండ సభకు మూడు లక్షల మంది హాజరవుతారన్నారు. ముందస్తు ఎన్నికలకు వెలుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
చిత్రం..నల్లగొండలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకు స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి