తెలంగాణ

తెరాస విజయఢంకా ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 26: సమీప భవిష్యత్తులో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని, ఇందుకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జరుగనున్న కేసీఆర్ సభ నాందిగా నిలువనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరిట అక్టోబర్ 3వ తేదీ నుండి జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతుండగా, తొలి ఎన్నికల ప్రచార సభ నిజామాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో మంత్రి పోచారం ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస బాధ్యులతో బుధవారం ఎం.పీ కవిత క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎంపీలు కవిత, బీబీ.పాటిల్ సహా తాజామాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. సీఎం సభ విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై సన్నాహక సమావేశంలో చర్చించారు. అంతకుముందు సభా వేదికగా ఎంపిక చేయనున్న దుబ్బ ప్రాంతంలోని ఖాళీ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ, 3వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ సభ ప్రారంభం అవుతుందన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి ఈ సభకు జన సమీకరణ చేస్తామని, ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలివస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల స్థాయిలో సీఎం సభలు జరుగుతాయని, మునుముందు అవసరాన్ని బట్టి నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా ఉంటాయని పోచారం తెలిపారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుపుతున్న కేసీఆర్ పాలనకు తోడ్పాటును అందించాల్సిన ప్రతిపక్షాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. దీంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధపడిందని పేర్కొన్నారు. గత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో ప్రజలు తెరాసను గెలిపించారని, ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉందన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని, గ్రామ కమిటీలు, కుల సంఘాలు ముందుకువచ్చి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడు కూడా అధికార పక్షానికి ప్రజల్లో ఇంతటి ప్రభంజనం ఉండడాన్ని చూడలేదన్నారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల నెలకొని ఉన్న అచంచలమైన నమ్మకమే పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తుందని, 105స్థానాల్లో తెరాస బంపర్ మెజార్టీతో గెలుపొంది తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ మహాకూటమి పేరుతో టీడీపీతో జతకడుతోందని ఎద్దేవా చేశారు. టీడీపీ గురించి చిన్న పిల్లవాడిని అడిగినా తెలంగాణకు వ్యతిరేక పార్టీ అని చెబుతారని, అలాంటి పార్టీతో కూటమి కట్టడం అంటే తెలంగాణ పట్ల కాంగ్రెస్‌కు ఎంతటి చిత్తశుద్ధి ఉందో ఊహించుకోవచ్చని అన్నారు. విలేఖరుల సమావేశంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, తాజామాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, వేముల ప్రశాంత్‌రెడ్డి, షకీల్, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌సింధే, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ.గౌడ్, మేయర్ ఆకుల లలిత, మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి, రెడ్‌కో చైర్మెన్ ఎస్‌ఏ.అలీం, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం