తెలంగాణ

నవంబర్ చివరలో ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నవంబర్ చివరలో ఎన్నికలు జరగుతాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ వేగం చూస్తుంటే నవంబర్‌లోనే ఎన్నికలు జరిగేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో గురువారం మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటే తమ విజయానికి సూచికన్నారు. రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి...రెండు కాకపోవచ్చాన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏమి చేయలేదని విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తాము చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందు కనిపిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌లో వర్గాలు లేవని, అయితే వైరుధ్యాలు ఉండటం మాములేనన్నారు. అవీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయని ఈటల దాట వేసారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపుగా వ్యవహరించాల్సిన అవసరం తమకు లేదని, అయితే తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు.