తెలంగాణ

లక్ష్మణ్ బాపూజీ పేరిట భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ మృత దేహాన్ని ఖననం చేసిన స్థలంలోనే బీసీ భవనాన్ని నిర్మించాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. మహా గొప్ప వ్యక్తిత్వం ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన జీవితం పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన ట్యాంకు బండ్‌పై ఆయన విగ్రహాన్ని నెలకోల్పాలని దత్తాత్రేయ కోరారు. వివిధ వృత్తుల మీద ఆధారపడిన వెనుకబడిన వర్గాల వారికి ఉపాధి కల్పనకు సహకార సంఘాలు ఏర్పాటు చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. రాష్ట్రంలో అఖిల భారత పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేశారని ఇన్ని విశిష్టతలున్న కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట భవనాన్ని ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని చెప్పారు.