తెలంగాణ

సిమ్లాలో వచ్చే నెల 30 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: భారత విద్యార్థి ఫెడరేషన్ 16వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు వీపీ సాను చెప్పారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిమ్లాలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 2వ తేదీ వరకూ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల వివక్ష ఏర్పడుతోందని, నాణ్యమైన విద్య అందకపోవడంతో సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయని అన్నారు. సమాన విద్య అందినపుడు మాత్రమే సమాజం అభివృద్ధి బాటలో ఉంటుందని అన్నారు. మొత్తం కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్లిందన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, హైదరాబాద్ నగర అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావేద్, క్రాంతి రణదివే తదితరులు పాల్గొన్నారు.