తెలంగాణ

29న విద్యాసంస్థల ఆత్మగౌరవ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో బడ్జెట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటి సమస్యలను ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నివేదించేందుకు బడ్జెట్ విద్యాసంస్థల పరిరక్షణకు ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసినట్టు కేజీ టు పీజీ విద్యాసంస్థల రాష్ట్ర జాక్ చైర్మన్ గింజల రమణారెడ్డి చెప్పారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా, రాష్ట్రంలోని ప్రతి కరస్పాండెంట్ తమ విద్యాసంస్థలను బంద్ చేసి స్ట్ఫా తో సహా హాజరుకానున్నారని అన్నారు. అవుటర్ రింగ్‌రోడ్ 10వ ఎగ్జిట్ గుర్రేపల్లి ఎక్స్‌రోడ్‌లోని స్వర్గీయ బాణాల వెంకటరెడ్డి ప్రాంగణంలో ఈ ఆత్మగౌరవ సభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
నీట్‌లో ర్యాంకు రాకున్నా విదేశాల్లో సీటు
నీట్‌లో తప్పనిసరి ర్యాంకు వస్తేనే విదేశాల్లోని వైద్య కళాశాలల్లో చేరేందుకు అర్హులనే నిబంధనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసినట్టు టెక్సిలా అమెరికన్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ సజు భాస్కర్ చెప్పారు. దీనివల్ల ర్యాంకు సాధించుకోలేకపోయిన విద్యార్థులు సైతం విదేశాల్లోని వైద్య కళాశాలల్లో చేరేందుకు అర్హత పొందుతారని చెప్పారు.
మీలో మీరు నమ్మకం పెంచుకోండి: సూపర్ కాప్ అమిత్
ప్రతి విద్యార్థి ముందు తనపై తనకు నమ్మకం పెంచుకోవాలని సూపర్‌కాప్‌గా పేరుగడించిన అమిత్ లోధా చెప్పారు. జైసల్మేర్ బోర్డుర్ సెక్యూరిటీ ఫోర్సు ఐజీపీగా పనిచేస్తున్న అమిత్ గురువారం నాడు ఇక్ఫాయి యూనివర్శిటీ విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సామర్థ్యాలను గుర్తించి వాటికి సానపట్టాలని అన్నారు.