తెలంగాణ

నేరెళ్ల వేణుమాధవ్ పేరిట అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రఖ్యాత ధ్వన్యానుకరణ కళాకారుడు , శాసనమండలి మాజీ సభ్యుడు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట అవార్డును ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. శాసనమండలిలో గురువారం నాడు నేరెళ్ల వేణుమాధవ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణను ప్రపంచ చిత్రపటంలోకి తీసుకువెళ్లిన విశ్వవిఖ్యాత మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ అని సీఎం కొనియాడారు. ధ్వన్యానుకరణను ఒక కళగా అభివృద్ధి చేశారని, చిత్తూరు నాగయ్యను స్ఫూర్తిగా తీసుకుని మిమిక్రీ చేసిన వేణుమాధవ్ తర్వాతర్వాత తన కళను మెరుగుపరుచుకున్నారని అన్నారు. ఒకపుడు డబ్బింగ్ వరకే పరిమితమైన దానిని విస్తృతం చేశారని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో కూడా తన కళను ప్రదర్శించి అంతర్జాతీయ ఖ్యాతి పొందారని అన్నారు. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ, సీ నారాయణ రెడ్డి లాంటి వారు తమ గ్రంథాలను వేణు మాధవ్‌కు అంకితం ఇచ్చారని, కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించి గౌరవించిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్‌కు, తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చారని అన్నారు. ఉర్రూతలూగించే అనేక ప్రదర్శనలు ఇచ్చారని , వేణుమాధవ్ పేరిట ఓపెన్ ఆడిటోరియం నిర్మించామని చెప్పారు.
ఆకుల లలిత వేణుమాధవ్ ప్రఖ్యాత కళాకారులని అన్నారు. ఎన్ రామచందర్‌రావు మాట్లాడుతూ మిమిక్రీని, వెంట్రిలాక్విజంను ప్రచారంలోకి తెచ్చిన మహాకళాకారుడు వేణుమాధవ్ అన్నారు. 12 సినిమాల్లో కూడా ఆయన నటించారని, చాలా సౌమ్యుడని, అరుదైన అవకాశాలను ఆయన దొరకబుచ్చుకున్నారని కొనియాడారు.