తెలంగాణ

కాంగ్రెస్ గూటికి నల్లగొండ జడ్పీ చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ మాజీ నాయకుడు కె జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బాలునాయక్ వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ముదనష్టపు పాలనకు ప్రజలు చరమగీతం పాడటానికి సిద్థంగా ఉన్నారన్నారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చి రంగారెడ్డి జిల్లాను కేసీఆర్ దగా చేసారని ధ్వజమెత్తారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే కాళేశ్వరం , మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టారని ఉత్తమ్ ఆరోపించారు. కార్యకర్తల జోష్ చూస్తుంటే రంగారెడ్డి ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కాంగ్రెస్ స్విప్ చేయబోతుందన్నారు.
కేసీఆర్ వైఫల్యాలపై ప్రచార వ్యూహం
సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వీడియో క్లిపింగ్‌ల ద్వారా వినూత్నంగా ఎన్నికల్లో ప్రచారాన్ని రూపొందిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దళిత సీఎం, యువతకు లక్షల ఉద్యోగాలు, పాతబస్తీని ఇస్తాంబుల్, హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని కేసీఆర్ ప్రసంగాల వీడియో క్లిపింగ్‌లతో ప్రచారం చేస్తామన్నారు. కేసీఆర్ మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని కోమటిరెడ్డి తెలిపారు.