తెలంగాణ

వరంగల్ ఎంజీయం పిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 27: వరంగల్ ఎంజీయం ఆసుపత్రిలో గురువారం తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఎంజీయం పిల్లల వార్డులోని ఏసీల్లో అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ఏసీల నుండి పొగలు, మంటలు రావడంతో ఒక్కసారిగా అందులో ఉన్న రోగులు, అటెండెంట్లు వైద్యులు చికిత్స పొందుతున్న పిల్లలను తీసుకుని పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో 23 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని పొగ మంటలను ఆర్పడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. వివరాలు తెలిసిన వెంటనే వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అక్కడికి హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏసీ వేడి కావడం వల్లే పొగలు వచ్చాయని ఎలాంటి నష్టం జరగలేదని అందరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది మేయర్‌కు వివరించారు.

చిత్రం.. ఆసుపత్రిలో ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటున్న మేయర్ నరేందర్