తెలంగాణ

బ్రాహ్మణ పరిషత్ జాబ్ మేళా వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఈ నెల 30న నిర్వహించాలనుకున్న ‘జాబ్ మేళా’ వాయిదా పడింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నియమ-నిబంధనలు (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమల్లోకి వచ్చినందున జాబ్ మేళాను వాయిదా వేశామని పరిషత్ చైర్మన్ కేవీ రమణా చారి తెలిపారు. ఎన్నికల తర్వాతే తిరిగి జాబ్ మేళా నిర్వహిస్తామని, బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ, యువకులు దీనిని అర్థం చేసుకోవాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాఉండగా ‘బెస్ట్’ కార్యక్రమం కింద శుక్రవారం జరగాల్సిన చెక్కుల పంపిణీనీ వాయిదా వేశామని చైర్మన్ రమణా చారి తెలిపారు.