తెలంగాణ

బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కృష్ణయ్య డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ ఎత్తివేయాలని బీహెచ్‌ఇఎల్-ఒబీసీ ఉద్యోగుల సంఘం ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేసింది. శుక్రవారం బీహెచ్‌ఇఎల్-ఒబీసీ ఉద్యోగుల సాధారణ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్నంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీ లేవని అన్నారు. గతంలో పాలించిన కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, బీసీ వ్యతిరేక వైఖరి అవలంభించడం మూలంగానే కల్పించలేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని ఆయన గుర్తు చేశారు. చట్టబద్ధమైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని కృష్ణయ్య వివుంచారు. ఉత్తర్‌ప్రదేశ్ రిజర్వేషన్ల కేసుపై సుప్రీం కోర్టు జనాభా ప్రకారం ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు చెప్పిందని ఆయన ఉదహరించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాస్, బర్క కృష్ణ, ఎ. యువరాజ్, ఎస్.శ్రీకృష్ణ, రాజ్‌కుమార్, పి. మల్లేష్, పి. యాదగిరి, ఆర్. మధుసూదన్, ఎం. భరత్ తదితరులు పాల్గొన్నారు.