తెలంగాణ

రాచరిక పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నాయకులపై వేధింపులకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాలనకు చరమ గీతం పాడనున్నారని ఆమె హెచ్చరించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆమె రేవంత్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్న నాయకులపై ఏదో రకమైన కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పాటైన రాష్ట్రంలో, ప్రజా వ్యతిరేక పాలన సాగుతున్నదని ఆమె దుయ్యబట్టారు. బీజేపీతో కుమ్మక్కైన టీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఇతర పార్టీలు నిలదొక్కుకోకుండా కుట్రలకు పాల్పడుతున్నదని ఆమె విమర్శించారు. జగ్గారెడ్డిని అరెస్టు చేసిన కేసులో కొంత మంది టీఆర్‌ఎస్ నాయకుల పేర్లు వినిపించినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.