తెలంగాణ

కోదండరామ్ దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి బీజేపీవైపు చూస్తోందా? కోదండరామ్ వ్యాఖ్యలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో 30 సీట్లు కావాలని తెలంగాణ జన సమితి తరఫున మహా కూటమికి ప్రతిపాదనలు ఇవ్వగా, మహా కూటమి అన్ని సీట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. చర్చల్లో కనీసం 20 సీట్లు ఇవ్వకపోతారా అని భావించిన తెలంగాణ జన సమితికి దిగ్భ్రమ కలిగించే సంఖ్యను కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో తెలంగాణ జన సమితి ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో కోదండరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో బీజేపీ నాయకులతో కోదండరామ్ టచ్‌లోకి వచ్చినట్టు చెబుతున్నారు. 119 స్థానాలకూ పోటీ చేయాలని తొలుత తెలంగాణ జన సమితి భావించినా అభ్యర్ధుల కొరత, ఎన్నికల వ్యయం, వౌలిక సదుపాయాల లేమి, బూత్ స్థాయిలో కమిటీల కొరత ఇతర కారణాలతో కనీసం 35 సీట్లకు పోటీ చేయాలని తెలంగాణ జన సమితి భావించింది. ఈ క్రమంలో మహా కూటమికి ఒక రూపం ఇవ్వడంతో మహా కూటమిలో కలిసి పనిచేయాలని భావించినా, అది సాఫల్యమయ్యేలా కనిపించడం లేదని చెబుతున్నారు. శుక్రవారం నాడు కోదండరామ్, బండారు దత్తాత్రేయతోనూ ఇతర నేతలతో సమావేశమయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సీట్లు ఇస్తే మహా కూటమితో వెళ్లాలని, లేకుంటే బీజేపీతో కలిసి వెళ్లే అంశాన్ని జనసమితి నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. శుక్రవారం నాటికి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మూడు స్థానాలకు మించి ఇవ్వలేమని తేల్చి చెప్పినట్టు తెలిసింది.