తెలంగాణ

రాష్ట్రంలో ఈసీ వేగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహస్య నిఘా ఎన్నికల ఏర్పాట్లపై గోప్యంగా ఆరా
హైదరాబాద్‌లోనే తిష్టవేసిన పరిశీలకుడు అరుణ్‌కుమార్ శర్మ

---------------------------------------------------------
హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న అపద్ధర్మ ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయడానికి రాష్ట్రానికి రహస్య పరిశీలకులను పంపించినట్టు సమాచారం. ఎన్నికల ఏర్పాట్లనే కాకుండా అపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఈ పరిశీలకులు ఓ కంట కనిపెడుతారని అధికార వర్గాల సమాచారం. ఎన్నికల జాబితా నుంచి లక్షలాది మంది ఓటర్లను తొలగించారని, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తోన్న ఫిర్యాదులు, ఆరోపణలపై కూడా ఈసి వేగులు రహస్యంగా క్షేత్రస్థాయిలో నిఘా పెట్టినట్టు తెలిసింది. ఇలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు అరుణ్‌కుమార్ శర్మ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, ఫలితాలు వెలువడేదాకా అరుణ్ శర్మ హైదరాబాద్‌లోనే ఉంటారని తెలిసింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నుంచి వెళ్లే నివేదికలకు సమాంతరంగా ఈసి వేగులు కూడా తమ స్వతంత్ర నివేదికలను పంపిస్తుందని సమాచారం. ఈ నెల చివరన కానీ, వచ్చే నెల మొదటివారంలో కానీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు మరోసారి హైదరాబాద్‌కు వచ్చి ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం ఉన్నట్టు నమ్మకం కలిగితేనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని అధికార వర్గాల సమాచారం.