తెలంగాణ

విద్యార్థి మేనిఫెస్టోపై ఏబీవీపీ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: అన్ని రాజకీయ పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో విద్యార్థి సమస్యలకు పరిష్కారాలను చూపాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప కోరారు. ఏబీవీపీ సైతం తెలంగాణ విద్యార్థి మేనిఫెస్టోను తయారుచేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీ సభ్యుడు, ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు పి మురళీమనోహర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ అనాలోచిత విద్యా విధానాలతో రాష్ట్రంలో అట్టడుగున పండిందని, ఈ నాలుగేళ్లలో బాగుపడుతుందని అనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభించారని ఆరోపించారు. నూతన రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కేవలం 25వేలు ఉద్యోగాలు మాత్రమే నింపారని అన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో విద్యార్థులను విభజిస్తూ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వారి మధ్య ప్రభుత్వమే వైషమ్యాలను సృష్టిస్తోందని అన్నారు. అధికారంలోకి వస్తే కార్పొరేట్ కళాశాలలను పొలిమేరలు దాటిస్తామని మాయ మాటలు చెప్పిన కేసీఆర్ తెలంగాణ బిడ్డలు చస్తుంటే ఎన్ని కాలేజీలపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని అన్నారు.