తెలంగాణ

ఆశయాల ఆచరణే అసలైన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నార్సింగి, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేర్చినపుడే అసలైన నివాళి అర్పించినట్టవుతుందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ , ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, మంత్రు లు, గాంధేయవాదులు, నాయకులు గాంధీజీ సమాధికి ఘనంగా నివాళి అర్పించారు. నగరంలోని లంగర్‌హౌస్ బాపూఘాట్‌లో మంగళవారం ఉదయం గాంధీజీ సమాధికి, స్మారక భవనంలో గాంధీజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. కాగా హిందూ, ముస్లిం, బౌద్ధ, క్రిస్టియన్ సర్వమత గురువులు ప్రార్థనలు కూడా నిర్వహించారు. అనంతరం బాపూఘాట్ ఆవరణలోఉన్న గాంధీజీ విగ్రహానికి ప్రత్యేకంగా నివాళి అర్పిచారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, అపద్ధర్మ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్, ప్రభాకర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, పర్యాటక శాఖ ఎండి మనోహర్, నగర సిపి అంజనీకుమార్, జిహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందర్‌రావు పాల్గొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు నివాళి
గాంధీ జయంతి పురస్కరించుకుని బాపూఘాట్‌లో జాతిపిత సమాధికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం జాతిపిత గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసారని, స్వాతంత్రం కోసం పోరాడిన మహా వ్యక్తి అని, ఆయన సేవలను జాతి మరువదని అన్నారు. జాతిపిత అడుగు జాడల్లో నేటి యువత నడుచుకోవాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో బంధులాల్, నర్సింహగౌడ్, రాజు, చంటిబాబు, అప్సార్ యూసుఫ్‌జాయి, కురుకుల కృష్ణ, గాంధేయవాధులు బాబురావు వర్మ, బాపూస్మృతి సభ్యుడు పరమానందం పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీ భవన్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి ఉత్తమ్ పూలమాల వేసి నివాళి అర్పించారు.

చిత్రం..బాపూఘాట్ వద్ద జాతిపితకు నివాళి అర్పిస్తున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్