తెలంగాణ

ఉన్నత విద్యలోచేరే సంఖ్య పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరే వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పేర్కొన్నారు. ఉపాధి కలిగేలా ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. బోధన , అభ్యసన పద్ధతుల్లో నూతన ఒరవడిపై కౌశలానికి వ్యూహాత్మక విధానాలను అవలంభించడంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి, బ్రిటిష్ కౌన్సిల్ కలిపి ఈ నెల 3వ తేదీన ప్లాజా హోటల్‌లో విద్యాసదస్సు నిర్వహించింది. ఇటీవలి కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయని, ప్రధానంగా బోధన, అభ్యసన రంగంలో సాంకేతికత ప్రభావంతో పద్ధతుల్లోనే మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యారంగం విస్తృతమవుతోందని, దానికి తగ్గట్టు నిపుణులు అవసరమని, వివిధ రంగాల్లో వారి సహకారం ఎంతో అవసరమవుతుందని చెప్పారు. ఉత్పాదక, సామార్థ్యాల రంగంలో మానవ వనరుల అవసరం ఎంతో ఉందని అన్నారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డితో పాటు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, బ్రిటిష్ కౌన్సిల్ అధికారి మంజులా రావు, గ్లోబల్ కన్సల్టెంట్ జో ఛఫర్, బెకీ స్మిత్ తదితరులు మాట్లాడారు. మండలి సభ్యులు, ఉన్నత విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, వివిధ వర్శిటీల రిజిస్ట్రార్లు, ఇతర వృత్తి విద్యా నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ఉన్నత విద్య కరిక్యులమ్‌ను నవీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. లింబాద్రి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పేరుకుపోతున్న అంశాలపై దృష్టి సారించి వాటిని తక్షణం పరిష్కరించాల్సి ఉందని అన్నారు. వి వేంకట రమణ మాట్లాడుతూ ఉన్నతవిద్యలో సమర్ధవంతమైన నాయకత్వ పటిమ అవసరమని, ఇందుకు దోహదం చేసిన బ్రిటిష్ కౌన్సిల్‌ను ఆయన అభినందించారు. మంజులా రావు మాట్లాడుతూ బోధన , అభ్యసన పద్ధతుల్లో నూతన ఒరవడికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యాత్మక నాయకత్వం అనేది నిరంతర ప్రక్రియ అని, వెయ్యి అడుగులు వేయదలిస్తే రెండో అడుగు ఏమిటనేది కూడా తెలియదని, ప్రతి ఒక్క అంశపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగాలని గ్లోబల్ కన్సల్టెంట్ జో ఛఫర్ పేర్కొన్నారు. వృత్తిపరమైన ప్రామాణిక చట్రాన్ని ప్రతి విశ్వవిద్యాలయం రూపొందించుకోవాలని బెకీ స్మిత్ చెప్పారు.