తెలంగాణ

ప్రాణాలు మింగిన ఈత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 1: కరీంనగర్ పట్టణానికి సమీపంలోని దిగువ మానేరు రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఈతకు వెళ్ళిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. వివరాల్లోకి వెళ్తే..నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన బీరెల్లి సాయికుమార్ (16), సాదుల సునంద్(16)తో పాటు మరో ఐదుగురు మిత్రులు. వీరంతా గత కొద్దిరోజులుగా నిత్యం ఉదయం పూట సమీపంలోని మానేరు రిజర్వాయర్ కట్టపై వ్యాయామం చేసి, అనంతరం రిజర్వాయర్‌లో స్నానాదికార్యక్రమాలు చేస్తారు. బుధవారం కూడా ఎప్పటిమాదిరిగానే వ్యాయామం చేసిన అనంతరం నీటిలో స్నానానికి దిగారు. వీరిలో ఐదుగురు ఒకవైపు వెళ్ళగా, సాయి, సునంద్ మరోవైపు వెళ్ళారు. నీటిలో ఈదుకుంటూ చాలాదూరం వెళ్ళగా, కొద్దిసేపు సేదదీరేందుకు నీటిపై తేలియాడే యత్నం చేశారు.
అయితే, లోతు అధికంగా ఉండడం, శ్వాసపీల్చడం ఇబ్బందిగా మారి నీటిలో మునిగిపోయినట్లు ప్రత్యక్షసాక్షులైన మిగతా విద్యార్థులు పేర్కొన్నారు. నీటిలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మిగతా వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు నీటిలో జాలర్లు సంచరిస్తున్నా రక్షించాలంటూ కేకలు వేసినా పట్టించుకోలేదని తోటిమిత్రులు విలపిస్తూ చెప్పడం సంఘటనాస్థలికి వచ్చిన వారిని కలిచివేసింది. మృతుల్లో ఒకరైన బీరెల్లి సాయికుమార్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో, మరో విద్యార్థి సాదుల సునంద్ స్థానికంగా ఉన్న శ్రీగాయత్రి కళాశాలలో చదువుతున్నారు. సంఘటన జరిగిన విషయం తెలియగానే వందలాదిమంది నగరవాసులు రిజర్వాయర్ వద్దకు చేరుకుని, జాలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు కూడా రాగా, రిజర్వాయర్ వద్ద కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. మృతుల కుటుంబీకుల రోదనలతో రిజర్వాయర్ పరిసరాలు మిన్నంటాయి. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు.