తెలంగాణ

కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు బాబు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 7: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని.. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే కుట్ర, కుతంత్రాలకు పాల్పడుతారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మందపల్లి గ్రామస్థులు మంత్రి హరీష్‌రావుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి అందచేశారు. కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ పార్టీ 14 ఏళ్లపాటు పోరాటం చేసి తీసుకొచ్చిందన్నారు. వచ్చిన తెలంగాణను నిలబెట్టాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంటే.. పడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ జతకడుతుంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తాయన్నారు. ఇక బోర్లు, బావులు ఎండిపోవుడు ఉండదని, చెరువులు, కుంతలు నిరంతరం మత్తడీ దుంకుతాయన్నారు. చంద్రబాబు నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్ర పన్నుతూ నోటికాడి బువ్వను లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీతో పోటీ చేసే ధైర్యం లేక అన్ని పార్టీలు ఏకమవుతున్నాయన్నారు. మహాకూటమి జెండా లేదని, ఎజెండా లేదని, అతుకుల బొంతలా తయారైందని ఎద్దేవా చేశారు. తెలంగాణను దోచుకునే చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టే ఎజెండా తప్ప మరొకటి లేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులు వాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనతో కుమ్మక్కైందని ఆరోపించారు. బతుకమ్మ చీరలను సైతం పంచకుండా కాంగ్రెసోళ్లు కుట్రపన్ని ఆపించారని విమర్శించారు. వచ్చేది టీఆర్‌ఎస్ సర్కారే అని...ఒక్క నెల ఆలస్యమైన బ్రహ్మాండంగా అక్కచెల్లెళ్లకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్ల్లలో టీఆర్‌ఎస్ ఏమి చేయపోతుందో చెప్పే అద్భుతమైన మేనిఫెస్టో రాబోతున్నట్లు తెలిపారు. గత ఎన్నికల మందు మేనిఫెస్టోలో చెప్పినవాటితోపాటు, చెప్పనవీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీలు పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో మందపల్లి పరిశ్రమల వళ్లిగా మారుతుందని జోస్యం చెప్పారు. మందపల్లిలో రైల్వేలైన్, పరిశ్రమల ఏర్పాటుతో గ్రామ దశ, దిశ మారనుందన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతుబంధు, రైతుబీమాలతో అన్నదాతల్లో భరోసా కల్పించినట్లు వెల్లడించారు.
ఘన స్వాగతం
సిద్దిపేట మండలం మందపల్లిలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు గ్రామస్తుల నుండి ఘన స్వాగతం లభించింది. దాసరోళ్ల ఆటలు, చిందుకళాకారుల నృత్యాలు, పిట్టలోల్ల ఆనందం, బతుకమ్మ, బోనాలు, మంగళ హరతులతో జనం నిరాజనం పలికారు. గ్రామంలోని ప్రధాన వీధుల భారీ ర్యాలీ నిర్వహించి మంత్రి హరీష్‌రావుకు మద్దతుగా ఏకగ్రీవం తీర్మానం చేసి, తీర్మాన పత్రాన్ని అందచేశారు.
ఈకార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యారెడ్డి, రాధకిషన్‌శర్మ, సత్యనారాయణరెడ్డి, రాంచంద్రం, కాముని శ్రీనివాస్, దేవునూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సిద్దిపేట జిల్లా మందపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు