తెలంగాణ

నిబంధనలు పాటించని పబ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: నిబంధనలకు విరుద్ధంగా పబ్స్ నిర్వాహకులు సమయాలను పాటించకపోవడంతో అర్ధరాత్రి రోడ్లపై మందుబాబులు విక్రుత చేష్టలు పరాకాష్టకు చేరుకుంటున్నాయన్న విమర్శలకు వెస్టు జోన్ టాస్క్ఫుర్సు పోలీసులు చెక్ పెట్టనున్నారు. జూబ్లీహిల్స్‌లో ఉంటున్న పబ్స్‌లపై ఆదివారం టాస్క్ఫుర్సు పోలీసులు ఆకస్మిక దాడులు నేపథ్యంలో 6 గురు పబ్స్ నిర్వాకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న అరెలైవ్ పబ్స్, కర్మా పబ్స్, డక్45 పబ్స్, అమెన్సీయా లంగ్ పబ్స్, 788 అవెన్యూపబ్స్, వప్పొర్ పబ్స్‌ల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అర్ధరాత్రి సమాయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తనిఖీలు చేస్తున్న పోలీస్ అధికారులకు విచిత్ర అనుభవాలు ఎదురైతున్నాయి. తాగిన మైకంలో ఒక మహిళ పోలీసులపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నగరవాసులను ఆశ్చర్య పరుస్తోంది. తాము మందు తాగుతున్నందున పోలీసులకు జీతాలు ఇస్తున్నారని సదరు మహిళ పోలీసులను ప్రశ్నించిన తీరుపై పోలీసులు ఖంగుతిన్నారు. జరుగుతున్న సంఘటనలకు అర్ధరాత్రి దాటిన పబ్స్‌లు మూసివేయకపోవడమేన్న విమర్శిలు బలంగా ఉన్నాయి. పబ్స్ నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడం వెనక పోలీసుల హస్తం ఉందని సామాజిక సంస్థలు ధ్వజమెత్తున్నాయి. పబ్స్‌కు ఇచ్చిన ప్రభుత్వ మార్గదర్శకాలను యజమానులు అమలు చేయకుండా సమయాలను పాటించడంలేదని దీంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని మహిళా సంఘాలు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.