తెలంగాణ

కేసీఆర్ కుటుంబానికి కాలకూట విషమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 8: మహాకూటమితో.. కేసీఆర్ కుటుంబానికి కాలకూట విషమేనని, అసెంబ్లీ రద్దు అహంకారిత పూరిత చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ ఆరోపించారు. సోమవారం జగిత్యాలలోని కౌండిన్య హాల్‌లో మహాకూటమి నేతలు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ఎదుర్కోవడానికే సెప్టెంబర్ 8న మహాకూటమి ఏర్పడిందని, నిజామాబాద్, నల్గొండ, వనపర్తి టీఆర్‌ఎస్ సభల్లో సీఎం మాట్లాడిన మాటలకు ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఐదేళ్ల పాటు ప్రజలు అధికారమిస్తే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసిన అసమర్ధ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలకు సమాధానం చెప్పలేక ముందస్తు ఎన్నికలను తెచ్చారన్నారు. అసెంబ్లీలో రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు నిలదీస్తే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన ఘనుడు కేసీఆర్ అన్నారు. ఊహించని రీతిలో అసెంబ్లీని రద్దుచేసి ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కేసీఆర్ 20 రోజులుగా బయటకే రావడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ 51నెలల పాలనపై హైకోర్టు 41 సార్లు మొట్టికాయలు వేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మక్కైన సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ బాకా ఊది ఇప్పుడు వౌనం పాటిస్తున్నాడన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఎ సర్కార్ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగినా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని రమణ ధ్వజమెత్తారు. మల్యాల మండలం రాంపూర్ గ్రామ శివారులో బావిలో బస్సు పడ్డ సంఘటనపై అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నాడని, కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది మరణించినా కేసీఆర్ ఎందుకు రాలేదని రమణ ప్రశ్నించారు. జగిత్యాల తాజామాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజలకు అత్యంత విశ్వాసం ఉందని జగిత్యాలలో మహాకూటమి అభ్యర్తి జీవన్‌రెడ్డి గెలుపు ఖాయమని రమణ చెప్పారు. అనంతరం టీజేఎస్ జిల్లా కన్వీనర్ చుక్కా గంగారెడ్డి మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పాలన ఆ నలుగురి గుప్పిట్లోనే బంధీ అయ్యిందని విముక్తి కోసమే మహాకూటమి ఏర్పడిందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాగర్‌రావు, వొల్లెం మల్లేశం, గాజుల నగేష్, గర్వందుల నరేష్ గౌడ్, అనుమల్ల జయశ్రీ రఘు, బొద్దుల సుజాత శ్రీనివాస్, బాలె శంకర్, రుక్కులు పాల్గొన్నారు.

చిత్రం..సమైఖ్యతను ప్రదర్శిస్తున్న మహాకూటమి నాయకులు