తెలంగాణ

ఆదర్శంగా అడవుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 8: తెలంగాణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అడవుల అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని ఐఎఫ్‌ఎస్ ట్రైనీ బృందం డైరెక్టర్ శశికుమార్ అన్నారు. ఉత్తరాఖంఢ్‌లోని డెహడ్రూన్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమిలో శిక్షణ పొందున్న 94 మంది ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ల బృందం హైదరాబాద్‌లో శిక్షణకు వచ్చి క్షేత్రస్థాయి పర్యటనకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ అటవీ ప్రాజెక్టులను పరిశీలించారు. సోమవారం చౌటుప్పల్‌కు వచ్చిన ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌లు లక్కారం శివారులో వంద ఎకరాలలో అభివృద్ధి చేస్తున్న అర్బన్ పార్కు, ఎకరం స్థలంలో అభివృద్ధి చేస్తున్న యాదాద్రి నేచురల్ ఫారెస్ట్ పైలెట్ ప్రాజెక్టును పరిశీలించారు. చిన్నకొండూరు రోడ్డుకు ఇరుపక్కల అభివృద్ధి చేస్తున్న సోషల్ ఫారెస్ట్‌ను సందర్శించారు. అనంతరం లింగారెడ్డిగూడెం సమీపంలో స్మృతివనం సందర్శించారు. పెంచుతున్న మొక్కలు, నాటిన మొక్కల వివరాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అడవుల అభివృద్ధి గురించి చంద్రశేఖర్‌రెడ్డి బృందానికి వివరించారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏడు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అడవుల అభివృద్ధిని చేపట్టినట్లు వివరించారు. ఈ యేడాది 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోని ఇప్పటికే 150 కోట్ల మొక్కలు నాటామన్నారు. వచ్చే ఏడాది 500 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. తెలంగాణ ప్రాంతంలోనే ప్రథమంగా స్మృతి వనం ఏర్పాటు చేసామన్నారు. మరణించిన వారి పేరుతో ఐదు వేలు ఇస్తే మొక్కను నాటి సంరక్షిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఎఫ్‌ఎస్ బృందం డైరెక్టర్ శశికుమార్ మాట్లాడుతూ అడవుల పెంపకం, హరితహారం కార్యక్రమాలు ఆకర్షించాయన్నారు. అర్బన్ పార్కు, పైలెట్ ప్రాజెక్టు, స్మృతి వనం బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, చౌటుప్పల్ రేంజర్లు శ్రీనివాసులు, సర్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..స్మృతివనంలో మొక్కలు నాటుతున్న ట్రైనీ ఐఎఫ్‌ఎస్ బృందం